అక్కినేని నాగ చైతన్య – సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రూపొందిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘లవ్ స్టోరీ’ ఇందులో చైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమాలోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సారంగదరియా.. పాట రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు.
అయితే.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతూ, సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. దాంతో లవ్ స్టోరి విడుదల విషయంలోనూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల అవుతుందని అన్నారు.
థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తే, మాత్రం మా సినిమా రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే లవ్ స్టోరీ విడుదల గురించి ఆలోచిస్తామన్నారు. జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా తెలియచేస్తామన్నారు నిర్మాత సునీల్ నారంగ్. అయితే.. లవ్ స్టోరీ జులై చివరి వారంలో కానీ.. ఆగష్టు ఫస్ట్ వీక్ లో కానీ విడుదల కానున్నట్టు టాక్ వినిపిస్తోంది.