Sunday, September 29, 2024
HomeసినిమాSelfish: 'సెల్ఫిష్' నుండి 'దిల్‌ఖుష్' లిరికల్ సాంగ్ విడుదల

Selfish: ‘సెల్ఫిష్’ నుండి ‘దిల్‌ఖుష్’ లిరికల్ సాంగ్ విడుదల

ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్’. పాతబస్తీ కుర్రాడిగా పూర్తి మాస్ పాత్రలో ఆశిష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. యూత్‌ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కాశీ విశాల్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీపడకుండా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుండి మే 1న కథానాయకుడు ఆశిష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దిల్‌ఖుష్’ అనే తొలి లిరికల్ వీడియో పాటను విడుదల చేస్తున్నారు. గీత రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట మిక్కి.జే.మేయర్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో ఆశిష్ మాస్‌ లుక్‌లో బిందాస్ యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పాతబస్తీ కుర్రాడిగా పూర్తి వైవిధ్యంగా, నేటి యువతరానికి నచ్చే విధంగా ఆశిష్ పాత్ర ఫుల్ మాసివ్‌గా ఎంటర్‌టైనింగ్ వుండబోతుందని ఈ పోస్టర్‌లో ఆశిష్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రలో ఇవనా హీరోయిన్‌గా నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్