Saturday, March 14, 2026
Homeసినిమానటి జయంతి కన్నుమూత

నటి జయంతి కన్నుమూత

సుప్ర సిద్ధ సినీ నటి జయంతి కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. చాలా కాలంగా ఆస్తమా వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బెంగలూరు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో  నేటి ఉదయం  ఆమె తన నివాసంలోనే మరణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఆమె దాదాపు 500 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజ్ కుమార్, రజనీకాంత్ లాంటి సినీ దిగ్గజాలతో కలిసి ఆమె నటించారు.

1945 జనవరి 6న బళ్లారిలో జయంతి జన్మించారు.  తన 18వ ఏట 1963 లో కన్నడ నాట ‘జెనుగూడు’ సినిమా ద్వారా ఆమె సినీ రంగప్రవేశం చేశారు. కొండవీటి సింహం, బొబ్బిలి యుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో ఆమె నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular