విభజన చట్టం ప్రకారం తెలంగాణ , ఏపీ లో అసెంబ్లీ సెగ్మెంట్ లు పెంచాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేయక ముందు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యంగం ఉందన్న శశిధర్ రెడ్డి ఆర్టికల్ 370 ఎత్తి వేశారు కనుక ఆర్టికల్ 170 అక్కడ అమలవుతుందన్నారు. దేశంలో ఎక్కడైనా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటె ఆర్టికల్ 170 సవరించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచాలంటే ఆర్టికల్ 170ని సవరించడం తప్పనిసరని మరీ శశిధర్ రెడ్డి చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ లో కలిపినప్పటికీ ఆ మండలాల ప్రజలు ఇంకా తెలంగాణ ఓటర్లుగానే ఉన్నారని శశిధర్ రెడ్డి తెలిపారు. 170 ఆర్టికల్ ను సవరించకుండానే 2018లో తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో ఆ ఏడు మండలాల ఓటర్లను ఆ ఎన్నికల్లో ఓటర్లుగా చూపించలేదు.
ఆర్టికల్ 170ని సవరించకపోయినా ఏడు మండలాల ఓటర్లను ఆంధ్రప్రదేశ్ చూపించి కేంద్ర ఎన్నికల కమిషన్ పెద్ద తప్పు చేసిందని ఆయన ఆరోపించారు. అప్పుడు ఎలా చేసారో ఇప్పుడు కూడా 170 ఆర్టికల్ సవరించకుండా తెలంగాణ ,ఏపీ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని మర్రి శశిధర్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణలో 34 స్థానాలు, ఏపీ లో 50 స్థానాలు పెరుగుతాయన్నారు.