Wednesday, March 12, 2025
HomeసినిమాChalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు ఇక లేరు

Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు ఇక లేరు

సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.  దాదాపు 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు. కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవ ముందే మరో సీనియర్ నటుడ్ని కోల్పోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగింది. చలపతిరావు మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు బుధవారం మహాప్రస్థానంలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్