Saturday, November 23, 2024
Homeసినిమాఈ సారి సమ్మర్ ను మించిన పెద్ద పండగ లేనట్టే! 

ఈ సారి సమ్మర్ ను మించిన పెద్ద పండగ లేనట్టే! 

Summer Bonanza: ప్రతి ఏడాది కూడా సమ్మర్ వస్తుందనగానే పెద్ద సినిమాలు బరిలోకి దిగిపోతుంటాయి. ఎగ్జామ్స్ పూర్తికావడంతో యూత్ అంతా కూడా ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉంటుంది. ఆ సమయంలో థియేటర్ల దగ్గర జనాల జాతర కనిపిస్తుంది. కానీ రెండేళ్లుగా కరోనా కారణంగా ఆ పరిస్థితి లేకపోవడం అందరినీ నిరాశకి గురిచేసింది. అందువలన ఈ సారి మాత్రం ఎంటర్టైన్ మెంట్ విషయంలో ‘తగ్గేదేలే’ అన్నట్టుగా ఆడియన్స్ ఉన్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలన్నీ, సమ్మర్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ‘రాధేశ్యామ్’ మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 10 వేల థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత 2 వారాల గ్యాపులో మార్చి 25న  ‘ఆర్ ఆర్ ఆర్‘ రంగంలోకి దిగుతోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయుకళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా సినిమాల కేటగిరిలో ‘కేజీఎఫ్ 2’ .. ‘బీస్ట్’ రెండు కూడా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు మామూలుగా లేవు. ఒకే రోజున ఈ స్థాయి సినిమాలు థియేటర్లకు వస్తుండటం ఉత్కంఠను రేపుతోంది.

ఇక ఏప్రిల్ 29వ తేదీన చిరంజీవి ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీతనం విషయంలో ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇక ఫిబ్రవరికీ .. ఏప్రిల్ కి మధ్య ‘భీమ్లా నాయక్’ ఉంటే, మార్చి లాస్ట్ వీక్ కీ .. ఏప్రిల్ ఫస్టువీక్ కి మధ్య ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కి ఉన్నాయి. ఇలా మార్చి .. ఏప్రిల్ నెలల్లో థియేటర్ల దగ్గర సందడి ఒక రేంజ్ లో ఉండబోతోంది. సమ్మర్ కి ఈ స్థాయి పోటీ కనిపించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. సంక్రాంతి నుంచి వాయిదా పడిపోయి సమ్మర్ వైపుకు పరిగెత్తుకొచ్చిన ఈ సినిమాల్లో, సంచలనం దిశగా సాగిపోయేవి ఏవో  చూడాలి.

Also Read : పాటల పూదోటలో అన్నీ లతలే

RELATED ARTICLES

Most Popular

న్యూస్