Sunday, January 19, 2025
Homeసినిమా బహుభాషా  చిత్రం సేవాదాస్ సెన్సార్ పూర్తి

 బహుభాషా  చిత్రం సేవాదాస్ సెన్సార్ పూర్తి

Seva Lal:  శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-ఎమ్.బాలు చౌహాన్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్‘. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్-ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు… చిత్ర నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపించారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రాన్ని బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందరికీ చేరువ చేస్తుండడం అభినందనీయమన్నారు.

కార్యనిర్వాహక నిర్మాత ఎమ్.బాలు చౌహాన్ మాట్లాడుతూ 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రూపొందిన’ సేవాదాస్’ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఓ బంజారా బిడ్డగా గర్వాన్నిస్తోందని పేర్కొన్నారు.  నిమా కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వీలయినంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Also Read : ‘సేవాదాస్’ సంచలనం సృష్టించాలి : సుమ‌న్, భానుచంద‌ర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్