Sunday, February 23, 2025
HomeTrending News కొత్త జడ్జిల ప్రమాణ  స్వీకారం

 కొత్త జడ్జిల ప్రమాణ  స్వీకారం

New Judges: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం నేడు జరిగింది.  నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన  ఈప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్  తర్లాడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్  వడ్డిబోయన సుజాత లచే  ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ హరనాధ్, పలువురు రిజిస్ట్రార్లు, తదితరులు పాల్గొన్నారు.

Also Read :  ఏడుగురు లాయర్లకు జడ్జిలుగా అవకాశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్