Sunday, January 19, 2025
Homeసినిమామోహన్ బాబు కెరియర్లో ఇది ప్రత్యేకమే!

మోహన్ బాబు కెరియర్లో ఇది ప్రత్యేకమే!

మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. తన దగ్గరికి వచ్చిన కథల్లో .. తనకి బాగా నచ్చిన పాత్రలనే చేస్తూ వెళుతున్నారు. అలా ఆయన చేసిన సినిమానే ‘శాకుంతలం‘. గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు ‘దుర్వాస మహర్షి’ పాత్రను పోషించారు. అందుకు సంబంధించిన లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ లుక్ ఆయనకి కరెక్టుగా సరిపోయింది.

మోహన్ బాబు పోషించిన ఈ పాత్ర .. సినిమాలో చాలా కీలకం. శకుంతల జీవితం అనూహ్యమైన మలుపు తిరగడానికి కారణం దుర్వాసుడే. కణ్వ మహర్షి తన ఆశ్రమంలో లేని సమయంలో దుష్యంతుడి గురించి శకుంతల ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో వచ్చిన దుర్వాసుడిని ఆమె గమనించదు .. అందువలన పట్టించుకోదు. దాంతో ఆమె ఎవరిని గురించి ఆలోచన చేస్తోందో ఆ వ్యక్తి ఆమెను మరిచిపోవాలని దుర్వాసుడు శపిస్తాడు. ఈ సంఘటనే ఈ కథలో కీలకం.

అలాంటి దుర్వాసుడి పాత్రలో మోహన్ బాబు లుక్ ఆకట్టుకునేదిగా ఉంది. ఈ పాత్రను గుణశేఖర్ డిజైన్ చేయించిన తీరు బాగుంది. మోహన్ బాబు కెరియర్ లోనే ఈ పాత్ర ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని చెప్పొచ్చు. తన డైలాగ్ డెలివరీతో ఆ పాత్రను ఆయన ఏ స్థాయిలో రక్తి కట్టించారనేది ఊహించుకోవచ్చు. శకుంతలగా సమంత .. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రను పోషించారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read :  ఏప్రిల్ కి వెళ్లిన ‘శాకుంతలం’ .. న్యూ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్!  

RELATED ARTICLES

Most Popular

న్యూస్