Sunday, January 19, 2025
HomeTrending NewsJawan: శ్రీవారి సేవలో షారూఖ్ ఖాన్

Jawan: శ్రీవారి సేవలో షారూఖ్ ఖాన్

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో షారూఖ్ తన కుమార్తె సుహానా, నయనతార, ఆమె భర్త విఘ్నేశ శివన్ లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. షారూఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ సినిమా ఎల్లుండి సెప్టెంబరు7 వ తేదీన విడుదల కానున్నది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్  గా నటించారు. విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, ప్రియమణి, యోగిబాబులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

షారూఖ్ ఖాన్ తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇటీవలే జమ్ము కాశ్మీర్ లోని శ్రీ వైష్ణవి దేవి ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకున్న సంగతి విదితమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్