Saturday, January 18, 2025
HomeసినిమాJawan Mini Review: 'జవాన్'తో చెలరేగిపోయిన షారుక్!

Jawan Mini Review: ‘జవాన్’తో చెలరేగిపోయిన షారుక్!

షారుక్ ఖాన్ ..  టీవీ సీరియల్స్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగిన ఒక సంచలనం. అప్పటి వరకూ వస్తున్న హీరోల బాడీ లాంగ్వేజ్ కి పూర్తి భిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో షారుక్ ప్రేక్షకులను మెప్పించాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. అలాంటి షారుక్ సైతం ఆ మధ్య వరుస ఫ్లాపులతో డైలమాలో పడిపోయాడు. అలాంటి ఆయనకి ‘పఠాన్’ హిట్ ఉపశమనాన్ని ఇచ్చింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి వచ్చిందే ‘జవాన్’.

తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి షారుక్ అభిమాని అయిన అతను, రెండేళ్ల పాటు షారుక్ చుట్టూ తిరుగుతూ .. ఆయన అడిగిన మార్పులు చేస్తూ ఈ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు. షారుక్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. కోలీవుడ్ వైపు నుంచి విజయ్ సేతుపతి – నయనతార పోషించిన కీలక పాత్రలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు.

షారుక్ పోషించిన రెండు పాత్రలు .. ఆ పాత్ర మధ్య చూపించిన వేరియేషన్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. దీపికతో షారుక్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. నిర్మాణ విలువల విషయంలో షారుక్ రాజీ పడలేదు. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ గురించిన విషయాలను .. నాటకీయంగా అనిపించే కొన్ని సీన్స్ ను పక్కన పెట్టేస్తే, షారుక్ అభిమానులను ఆకట్టుకునే సినిమాగా ఇది నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్