రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం శంకర్ సరికొత్త ప్రయోగం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జెంటిల్ మేన్ మూవీ నుంచి రోబో 2.0 వరకు ప్రతి సినిమాలో ఏదో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తుండేవారు. తాజాగా ‘ఇండియన్ 2’తో కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేయనున్నారని తెలిసింది.
1996లో కమల్ హాసన్ తో తెరకెక్కించిన సినిమా ఇండియన్. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 రూపొందిస్తున్నాడు. ఇందులో ఇతర కీలక పాత్రల్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హీరో సిద్థార్థ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా, మిన్నాల్ మురళి ఫేమ్ గురు సోమంసుందరం, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. శంకర్ తన సినిమాల్లోని పాటల్లో హీరోలని విభిన్నమైన గెటప్ లలో చూపించి గ్రాఫిక్స్‌తో మాయాజాలం చేస్తుంటారు. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు.
ఇండియన్ 2 విషయంలోనూ ఇదే తరహాలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారట. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే.. ఈ సినిమా కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడబోతున్నారట. ప్రముఖ వీఎఫ్ ఎక్స్ సంస్థ లోలా ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ అందిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శంకర్ లోలా వీఎఫ్ ఎక్స్ స్టూడియోలో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సినీ ప్రియులతో పాటు నెటిజన్‌లు ఇండియన్ 2 సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండనుందని కామెంట్ లు చేస్తున్నారు. త్వరలోనే ఇండియన్ 2 గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. శంకర్.. ఇండియన్ 2 తో మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారేమో మరి..!