గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.
గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కీలక చర్చలు జరుపుతున్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన… ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిస్థితులపై చర్చించారు. అయితే తాజాగా ఆయనతో గుజరాత్ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రగతిభవన్ భేటీ అయిన వీరిద్దరూ జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్ పార్టీని ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్‌సింగ్ వాఘేలా ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.