Saturday, September 21, 2024
HomeTrending NewsSankara Eye Foundation: హైదరాబాద్ లో శంకర కంటి ఆస్పత్రి ప్రారంభం

Sankara Eye Foundation: హైదరాబాద్ లో శంకర కంటి ఆస్పత్రి ప్రారంభం

అవసరమైన వారికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కంటి సంరక్షణ చికిత్సలను అందించే కార్యాచరణను కొనసాగించడంలో భాగంగా శంకర ఐ ఫౌండేషన్ (ఇండియా & యూఎస్ఏ) తెలంగాణలోని హైదరాబాద్ లో తన సూపర్ – స్పెషాలటీ హాస్పిటల్ ను ప్రారంభించింది. ఈ 225 పడకల హాస్పిటల్ ను ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కె.టి. రామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 1.27 లక్షల చ.అ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ హాస్పిటల్ కాటరాక్ట్, కార్నియా, గ్లకోమా, పిడియాట్రిక్ ఆప్తల్మాలజీ, స్ట్రాబిస్మస్, ఆర్బిట్ & అకులోప్లాస్టీ, విట్రియోరెటినల్ సేవలకు సంబంధించి అధునాతన చికిత్స సదుపాయా లను అందించనుంది.
శంకర ఇప్పటికే దేశవ్యాప్తంగా పటిష్ఠ ఉనికి కలిగిఉంది. ఈ కొత్త హాస్పిటల్ 13వ ఆసుపత్రి. శంకర ఐ హాస్పిటల్ అనేది దేశవ్యాప్త ఉద్యమం లాంటిది. ఇది అధిక నాణ్యమైన, అధిక పరిమాణంలో నేత్ర సంరక్షణను రోగుల సామాజిక, ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ అందిస్తుంది. ఇప్పటి వరకూ ఇది 114 జిల్లాల్లోని 19804 గ్రా మాల పరిధిలో 2.3 మిలియన్ల ఉచిత కంటి సర్జరీలు చేసింది. 5.9 మిలియన్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసింది. ఈ ఆసుపత్రికి శంకర ఐ ఫౌండేషన్ USA & ఫీనిక్స్ ఫౌండేషన్ ఐ కేర్ దాతలు, వలంటీర్లు మద్దతు ఇస్తున్నారు.


ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా ఐటీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి కె.టి. రామా రావు మాట్లాడుతూ, ‘‘శంకర ఐ హాస్పిటల్స్ ఇంత పెద్ద ఎత్తున సమాజానికి సేవలందించే దృఢ సంకల్పం కనబర్చడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సూపర్-స్పెషాలిటీ భారతదేశంలో జాతీయ కంటి ఆరోగ్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు సేవ చేయడానికి సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలా గొప్పవి. తెలంగాణకు తన ఉనికిని విస్తరించడం ద్వారా, ఈ నెట్‌వర్క్ ఆసుపత్రి మన రాష్ట్రంలో కూడా కంటి ఆరోగ్య సంరక్షణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.
కొత్త ఆసుపత్రి ప్రారంభం గురించి వ్యాఖ్యానిస్తూ, డాక్టర్ ఆర్.వి. శంకర ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ రమణి వారణాసిలో ఇలా అన్నారు: ‘‘నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంతో శంకర ఐ ఫౌండేషన్ ప్రారంభించబడింది. భారతదేశ వ్యాప్తంగా 2030 నాటికి ఏటా అర మిలియన్ (5 లక్షలు) ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ప్రజలకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ కంటి సంరక్షణ చికిత్సను అందించడాన్ని కొనసాగించడం మా లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న మా అన్ని ఆసుపత్రుల మాదిరిగానే, ఈ ఆసుపత్రి కూడా ప్రత్యేకమైన హైబ్రిడ్ మోడల్‌లో పని చేస్తుంది. ఇందులో తెలంగాణలోని 8 జిల్లాల పరిధిలోని గ్రామాల పేదలకు ఉచిత కంటి శస్త్ర చికి త్సలు అందించబడతాయి, మధ్య-ఆదాయ వర్గాల వారు, సంపన్నులు చికిత్సలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
ఎస్ఈఎఫ్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు మురళీ కృష్ణమూర్తి మాట్లాడుతూ, “ప్రపంచంలో దృష్టి లోపం ఉన్నవారి అత్యధిక జనాభాకు భారతదేశం నిలయంగా ఉంది. ఈ కేసులలో 80% కంటే ఎక్కువ మంది నివారించదగిన అంధత్వంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, దృష్టి సమస్యలు ఉన్న ప్రజలకు, ముఖ్యంగా పేదలు నివసించే గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు నాణ్యమైన కంటి సంరక్షణ చికిత్సను అందించే లక్ష్యంతో ఉన్న శంకర ఐ హాస్పి టల్స్‌ కు మద్దతు ఇవ్వడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఈ ఆసుపత్రి పేదలకు అత్యాధునిక చికిత్సను అందజే స్తుంది, తద్వారా వారు కూడా ఉత్తమ వైద్య సంరక్షణ పొందుతారు’’ అని అన్నారు.
శంకర ఐ హాస్పిటల్ నేడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, మహారాష్ట్రలతో సహా తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ ఆసుపత్రులను పూర్తిగా దాతృ త్వంతో నిర్వహించే అతిపెద్ద హాస్పిటల్ నెట్‌వర్క్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్