Sunday, November 24, 2024
HomeTrending Newsఅజ్ఞాతం వీడిన మావో నేత శారదక్క

అజ్ఞాతం వీడిన మావో నేత శారదక్క

మావోయిస్టు నేత శారదక్క హైదరాబాద్‌ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం మహబూబాద్‌ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్‌ పార్టీకి ఆకర్షితురాలైన ఆమె 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. కాగా, శారదక్క భర్త అయిన మావోయిస్టు నేత హరిభూషణ్.. ఈ ఏడాది జూన్‌ 21వ తేదిన కరోనాతో చనిపోయారు.

శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. సమ్మక్క లొంగుబాటుకు ఆమెకు 5లక్షల రివార్డు ఉందని, లొంగిపోయిన మావోలకు భద్రత కల్పిస్తాం- ఎలాంటి భయం అవసరం లేదని డిజిపి భరోసా ఇచ్చారు.

1995లో కొత్తగూడెం పాండవదళం హరీష్ భూషణ్ ఆధ్వర్యంలో శారదక్క  జాయిన్ అయ్యాక , మైనర్ గా సమ్మక్క పాండవదళంలో పనిచేసి ఆ తర్వాత పాండవదళం నుంచి కిన్నెరదళం కు మారారు. 2000- 04 వరకు సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ లో పనిచేశారు. 2001లో ఏరియా కమిటీ మెంబర్ గా ప్రమోషన్ పొందారు. చెర్ల LOS కమాండర్ గా పనిచేశారు. 2008లో వరంగల్ SP దగ్గర లొంగిపోయారు. 2011లో మళ్ళీ దళంలోకి రావాలని హరిభూషన్ నుంచి పిలుపు ఇవ్వటంతో 2011 నుంచి 2016 వరకు హరిభూషన్ తో దళంలో పనిచేశారు. 2016లో సమ్మక్కకు ప్రమోషన్- DVC మెంబర్ గా మళ్ళీ ప్రమోషన్ పొందారు. హరిభూషన్ భార్య కావడంతో పార్టీలో ప్రాధాన్యత ఎక్కువగా ఉండేదని డిజిపి తెలిపారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్