Tuesday, March 10, 2026
HomeTrending Newsకేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల భూములు - వైఎస్ షర్మిల

కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల భూములు – వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. గవర్నర్ తో భేటీలో పాదయాత్ర వివరాలు, తెరాస నేతలు కల్పిస్తున్న అడ్డంకులు తదితర అంశాలు వివరించిన షర్మిల వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… గత కొన్నిరోజులుగా తన పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో గవర్నర్ కు వివరించానని తెలిపారు. రాజ్‌భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను కలిసిన అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు. నర్సంపేటలో తమ పార్టీకి చెందిన వాహనాలకు నిప్పంటించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. శాంతిభద్రతల సమస్య సాకుగా చూపించి తనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకు వచ్చారన్నారు. పాదయాత్ర చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారన్నారు. తన మీద దాడి జరిగితే పోలీసులదే బాధ్యత అని ఆమె తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తికి రాయబోతున్నానని ఆమె తెలిపారు. నేను తెలంగాణ బిడ్డనే… తాను టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమయిన వాహనాలను కేసీఆర్ కు చూపించాలని వస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తాను వాహనంలో ఉండగానే అలాగనే పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారన్నారు. పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నానని తెలిపారు. ప్రగతి భవన్ లో సోదాలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల నగదు బయటపడుతుందని ఆమె అన్నారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. కేటీఆర్, కవిత ఇళ్లపై దాడులు చేయాలన్నారు.

Also Read KCR అంటే “కల్వకుంట్ల కమీషన్ రావు”- వైఎస్ షర్మిల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular