కేసీఅర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. కేసీఅర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామ ప్రజలతో ఈ రోజు మాట- ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఅర్ ఒక గజ దొంగ అని అందరినీ పిచ్చోల్లను చేశాడని విమర్శించారు. కేసీఅర్ కి ఎన్నికలతోనే పని అని ఓట్లు ఉంటేనే బయటకు వస్తాడని ఎద్దేవా దేశారు.
షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…
రైతులను నిండా ముంచేశాడు. వరి వేస్తే ఉరి ఆన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఅర్. వ్యవసాయానికి సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టాడు. 30 వేల పథకాలు బంద్ పెట్టీ 5 వేలు ముష్టి ఇచ్చినట్లు రైతు బందు ఇస్తున్నాడు. బంగారు తెలంగాణలో రైతుకు గౌరవం లేదు. బంగారు తెలంగాణలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు లేదు. రుణమాఫీ కాక రైతును బ్యాంక్ ల వద్ద డీ ఫాల్టార్స్ గా మార్చారు. ఉద్యోగాలు లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిగ్రీలు, పిజిలు చదివి హమాలి పని చేసుకుంటున్నారు. ఉద్యమంలో నేను నా ముసలిది తప్పా ఎవరు లేరు అన్నారు. ఇప్పుడు అందరూ దిగిపోయారు. కొడుకు,బిడ్డ,అల్లుడు అందరికీ పదవులు. ఉద్యమంలో పిల్లలను చందమామలు అన్నారు. ఇప్పుడు కేసీఅర్ కండ్ల కు పిల్లలు చందమామలు లెక్క కనిపించడం లేదా .?
బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. ఇంత అప్పు చేసి దేనికి డబ్బు లేదు. బీడీ బిచ్చం…కళ్ళు ఉద్ధెర. రేషన్ లో బియ్యం తప్పా ఏమి ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేర్లు చెప్పి లక్షల కోట్లు తినేశారు. కేసీఅర్ గడిలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టారు. దోచుకున్న డబ్బుతో విమానాలు కొంటున్నాడు. ఇక్కడ తిన్నది చాలక దేశం మీద పడ్డాడు. బీజేపీ,కాంగ్రెస్ లు సైతం ప్రశించడంలో విఫలం అయ్యాయి. కేసీఅర్ అరాచకాలను ఢిల్లీ వరకు వెళ్లి పిర్యాదు చేసింది మేమే. ఎవ్వరూ ప్రజల పక్షాన నిలబడలేదు. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం. ప్రజల పక్షాన నిలబడుతున్నం. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకువస్తాం