Sunday, February 23, 2025
HomeTrending Newsషర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. షర్మిల బీజేపీ పార్టీ కోవర్టు అని, బీజేపీ- షర్మిల దొంగాట ఆడుతున్నాయని కవిత ఎండగట్టారు. షర్మిల విమర్శలకు బదులిస్తూ పొలిటికల్ టూరిస్టును కాదు.. ఉద్యమ బిడ్డను అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణం

మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారెట్టు

మీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి ‘కవిత’ను నేను !

Also Read : ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్