Sunday, September 8, 2024
HomeTrending NewsYSRTP: వినూత్న రీతిలో YS షర్మిల నిరసన

YSRTP: వినూత్న రీతిలో YS షర్మిల నిరసన

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పోలీసులకు ఈ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  ఆమె నివాసం లోటస్ పాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల ఇవాళ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించాలకున్నారు. దళిత బంధులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్ గ్రామ ప్రజలు ఇటీవల ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన షర్మిల.. ఆ ఊరికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడాలని భావించారు. పర్యటనకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవటంతో షర్మిల… పోలీసులకు హారతి ఇచ్చి, నిరాహార దీక్షకు దిగారు.

అయితే షర్మిల పర్యటనకు పోలీసుల అనుమతి లేకపోవటంతో హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళ్లకుండా చూడటం కోసం లోటస్ పాండ్‌లోని నివాసం వద్ద ఆమెను గృహ నిర్బంధం చేశారు. లోటస్ పాండ్‌ వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. గజ్వేల్ బయల్దేరేందుకు ప్రయ్నతించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారికి హారతి ఇచ్చారు.

తాను గజ్వేల్ వెళ్తానని.. స్థానికులతో మాట్లాడతానని ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన పర్యటనను శాంతియుతంగానే చేపడతానని ఆమె చెప్పారు. తనను ఆపడం సరికాదని ఆమె పోలీసులకు హితవు పలికారు. పోలీసుల అరాచకానికి, కేసీఆర్ నియంత పాలనకు నిరసనగా.. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా సాయంత్రం వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేపడతానని షర్మిల నిరాహారదీక్షకు దిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్