Sunday, February 23, 2025
Homeసినిమాషూటింగ్ లో గాయ‌ప‌డ్డ‌ విజ‌య్, స‌మంత‌. ఇది నిజ‌మేనా..?

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ‌ విజ‌య్, స‌మంత‌. ఇది నిజ‌మేనా..?

I it?: సెన్సేష‌న‌ల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఖుషి. ఈ చిత్రానికి నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాశ్మీర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు  ద‌ర్శ‌కుడు శివ తెలిపారు. దాదాపు 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శరణ్య తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత గాయపడ్డారని వార్త‌లు వ‌చ్చాయి. కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో చిత్రీకరించిన ఒక స్టంట్ సీన్ లో… లిడ్డర్ నది పై తాడుతో నిర్మించిన వంతెన పై నుంచి వాహనాన్ని నడపాల్సి ఉందట. ఆ సీన్ చేస్తున్నప్పుడు వాహనం నీటిలో పడటంతో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వీరిద్దరికీ చికిత్స అందించారని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్పందిస్తూ… ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ,సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది అని తెలియ‌చేశారు. సో.. విజ‌య్, స‌మంత‌కు గాయాలు అయ్యాయి అనేది రియ‌ల్ న్యూస్ కాదు.. ఫేక్ న్యూస్. అదీ.. మేట‌రు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్