Tuesday, September 17, 2024
HomeసినిమాKushi: అది బాగా వర్కవుట్ అయ్యింది.. 'ఖుషి' సక్సెస్ అయ్యింది - శివ నిర్వాణ

Kushi: అది బాగా వర్కవుట్ అయ్యింది.. ‘ఖుషి’ సక్సెస్ అయ్యింది – శివ నిర్వాణ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ప్రేమను ఏకగ్రీవంగా పొందుతున్న ఖుషి సక్సెస్ మీట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ… ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమా బాగుందంటూ మీడియా పర్సన్స్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సినిమాను మీడియా కరెక్ట్ గా జడ్జ్ చేస్తుందని నమ్ముతాను. అలాంటి మీడియా నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందంగా ఉంది. దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని రెండేళ్ల కిందట ఖుషి కథ రాసుకున్నాను. ఆ పాయింట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఉదయం షో యూత్ తో మొదలై మ్యాట్నీ కపుల్స్ వెళ్తున్నారు. ఫస్ట్ షో కు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇలా మరి కొన్ని వారాల పాటు మా ఖుషి థియేటర్స్ లో ఫ్యామిలీస్ తో కళకళలాడాలని కోరుకుంటున్నాను.

ఫన్ అండ్ ఎమోషన్ ను విజయ్ తన నటనలో అద్భుతంగా చూపించాడు. అలాగే సమంత గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫస్టాఫ్ ఫన్ , లవ్ తో బాగుందని, అలాగే సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్ నచ్చాయని అంటున్నారు. చివరిలో క్లైమాక్స్ ను బాగా హ్యాండిల్ చేశానని చెబుతున్నారు. ఒక క్లిష్టమైన పాయింట్ ను చాలా సరళంగా అందరికీ రీచ్ అయ్యేలా చూపించామంటూ ప్రశంసలు వస్తున్నాయి. దర్శకుడిగా నేను ప్రేక్షకుల మనసుల్లో మరో మెట్టుకు పైకి ఎదిగాను. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. ఇందులో స్టార్ గా తన ఇమేజ్ కాకుండా విప్లవ్ క్యారెక్టర్ ను అర్థం చేసుకుని విజయ్ నేచురల్ గా నటించాడు. ఏదైనా మనం మనిషిగా మన శక్తితో సాధించాలని అనుకుంటాడు. ఇలాంటి కొత్త పాయింట్ ఉంది కాబట్టే నేను లవ్ స్టోరీ చేశాను. లాస్ట్ అరగంట ప్రేక్షకుల్ని ఒక ఎమోషనల్ మూడ్ లోకిి తీసుకెళ్లాలని ముందే అనుకున్నాము. అది బాగా వర్కవుట్ అయి ప్రేక్షకులకు రీచ్ ‌అవడం సంతోషంగా ఉంది.

సిద్ధాంతాలు, శాస్త్రాలు వేరవచ్చు కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ఈ సినిమాలో చెప్పాము. క్లైమాక్స్ ముందు వరకు క్యారెక్టర్స్ ను సస్టెయిన్ చేయకపోతే ముగింపు అంత బాగా రిసీవ్ చేసుకునేవారు కాదు. అంత సేపు ఎమోషన్ క్లైమాక్స్ చూశారంటే మీరు అక్కడే సినిమాతో కనెక్ట్ అయినట్లుగా భావిస్తాను. క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు. ఖుషి చూసి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తోనే వస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ కు స్పెషల్ థాంక్స్. థియేటర్ లో పాటలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్స్, మిగతా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్