Sunday, January 19, 2025
HomeTrending Newsనాగోల్ స్నేహపురిలో కాల్పులు

నాగోల్ స్నేహపురిలో కాల్పులు

హైదరాబాద్​లోని నాగోల్‌‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ బంగారం దుకాణంలో దుండగులు కాల్పులు జరిపి, నగలు ఎత్తుకెళ్లారు. నాగోల్​లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని సుప్రజ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నాలుగు బుల్లెట్స్‌‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి దగ్గరలోనే కాల్పుల ఘటన చోటు చేసుకోవటం పోలీసులకు సవాల్ గా మారింది.

రాజస్థాన్‌‌‌‌కు చెందిన కల్యాణ్‌‌‌‌ చౌదరి స్నేహపురి కాలనీలో మహదేవ్ జ్యువెలర్స్ పేరుతో గోల్డ్‌‌‌‌ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతను సికింద్రాబాద్‌‌‌‌లోని ఓ వర్క్​షాప్ నుంచి గోల్డ్‌‌‌‌ కొనుగోలు చేస్తుంటాడు. గురువారం రాత్రి వర్క్​షాప్ ఉద్యోగి సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌ (25) బంగారంతో నాగోల్‌లోని మహదేవ్ జ్యువెలర్స్‎కి‌‌‌ వచ్చాడు. కాగా.. సుఖ్‌‌‌‌దేవ్‌ను ఫాలో అవుతూ వచ్చిన దుండగులు నాగోల్‎లో రాత్రి 9:30 గంటల సమయంలో అటాక్ చేశారు. సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌.. మహదేవ్ జ్యువెలర్స్ లోకి వెళ్లగానే… దుండగులు కూడా షాపులోకి వెళ్లి షట్టర్ క్లోజ్ చేశారు. కల్యాణ్‌‌‌‌ చౌదరి, సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌పై తుపాకీ గురి పెట్టి, బంగారంతో పాటు ఆభరణాల బ్యాగు ఇవ్వాలని బెదిరించారు. అయితే అందుకు నిరాకరించడంతో కల్యాణ్‌‌‌‌ చౌదరి, సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌పై కంట్రీమేడ్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌‌‌‌‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కల్యాణ్‌‌‌‌ ముఖం పైనుంచి బుల్లెట్‌‌‌‌ దూసుకెళ్లింది. సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌ ఎడమ చెవి, ఎడమ భుజం, కాలులోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. లోపలి నుంచి శబ్దాలు, అరుపులు రావడంతో స్థానికులు షాప్‌‌‌‌ వద్దకు వచ్చి.. షట్టర్‌‌‌‌‌‌‌‌ ఎత్తారు. వెంటనే దుండగులు.. లోపలి నుంచి బయటకు వచ్చి, స్థానికులను తుపాకీతో బెదిరించి నగల బ్యాగుతో బైక్‌‌‌‌పై పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. యూపీ, బీహార్ గ్యాంగ్‌‌‌‌లు ఈ దోపిడీకి పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్