Saturday, January 18, 2025
HomeసినిమాPrathinidhi 2: నారా రోహిత్ 'ప్రతినిధి 2' షూటింగ్ ప్రారంభం

Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ షూటింగ్ ప్రారంభం

నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రానికి “One man will stand again, against all odds” అనేది క్యాప్షన్.

ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా  క్యూరియాసిటీ పెంచింది.కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్