Sunday, January 19, 2025
HomeసినిమాShraddha Srinath: 'సైంధవ్' లో నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్‌.

Shraddha Srinath: ‘సైంధవ్’ లో నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్‌.

వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్‌ లో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది.

మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీలో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా సైంధవ్‌ లో మనోజ్ఞ గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. చాలా మంది అద్భుతమైన నటీనటులు కలిసి తెర పై కనిపిస్తూ ప్రేక్షకులకి గొప్ప అనుభూతి ని ఇవ్వనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్