Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య మూవీలో శ్రియా రెడ్డి విలనిజం!

బాలయ్య మూవీలో శ్రియా రెడ్డి విలనిజం!

బాలకృష్ణ అభిమానులందరి దృష్టి, బాబీ దర్శకత్వంలో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాపైనే ఉంది. నాగవంశీ – సాయిసౌజన్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం భారీ షెడ్యూల్స్ ను పూర్తిచేస్తూ వెళుతున్నారు. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా అలరించనుండగా, ముఖ్యమైన పాత్రలో చాందినీ చౌదరి కనిపించనుంది. ఇక ఇప్పుడు తాజాగా శ్రియా రెడ్డి పేరు వినిపిస్తోంది.

శ్రియా రెడ్డి .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకు .. విలనిజంతో కూడిన పాత్రలకు పెట్టింది పేరు. ఆ తరహా పాత్రలలో ఆమె ఒక రేంజ్ లో ఇమిడిపోతుంది. ‘సలార్’ లో తెరపై ఆమె కనిపిస్తున్నంత సేపు ఒక్కసారిగా గ్రాఫ్ పెరుగుతుంది. అంతటి పవర్ఫుల్ పాత్రలో ఆమె మెప్పించింది. అలాంటి శ్రియా రెడ్డి ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయనుందని అంటున్నారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఈ పాత్రలో ఆడియన్స్ కి ఆమె విశ్వరూపం కనిపించడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటివరకూ తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తూ వచ్చింది. కానీ ఇక ఈ తరహా పాత్రలకు శ్రియా రెడ్డి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే సమయం ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ఆమె పాత్రను బాబీ ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య, ఈ సినిమాతో ఏ స్థాయి సంచలనాన్ని సృష్టిస్తాడనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్