Saturday, January 18, 2025
Homeసినిమాహారర్ థ్రిల్లర్ తో భయపెట్టనున్న శృతిహాసన్! 

హారర్ థ్రిల్లర్ తో భయపెట్టనున్న శృతిహాసన్! 

శృతిహాసన్ .. వెండితెరపై మెరిసే బంగారు తీగ. నాజూకు భామగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ. తెలుగు .. తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్న శ్రుతి, యూత్ లో విపరీతమైన ఫాలోయింగును సంపాదించుకుంది. ఒకానొక దశలో ఆమె ఎంత పారితోషికం అడిగితే అంత ఇచ్చే స్థాయికి మేకర్స్ వెళ్లిపోయారు. అలాంటి సమయంలో ఆమె బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ శ్రద్ధపెట్టింది. అక్కడ దృష్టి పెట్టి .. ఇక్కడి నుంచి వెళ్లే అవకాశాలను నిర్లక్ష్యం చేసింది.

దాంతో టాలీవుడ్ కీ .. కోలీవుడ్ కి ఆమె పూర్తిగా దూరమైపోయింది. బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ కూడా రాలేదు. లవ్ ఎఫైర్ లో నుంచి బయటపడిన ఆమెకి, ముందుగా పిలిచి ఛాన్స్ ఇచ్చింది కూడా తెలుగు సినిమానే. ఆమె చేసిన పెద్ద సినిమాలు క్రితం ఏడాది వరుసగా థియేటర్ల దగ్గర సందడి చేశాయి. ఈ ఏడాది మాత్రం కొత్త ప్రాజెక్టుల జాబితాలో ఆమె పేరు కనిపించడం లేదు. ఈ నేపథ్యలోనే ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

శ్రుతి హాసన్ ఇంతవరకూ నాయిక ప్రధానమైన సినిమా చేయలేదు. అలాంటి ఒక కథకు ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. గతంలో ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసిన కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘భాగమతి’ తరువాత వాళ్లు చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ కంటెంట్ ఇది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్