Wednesday, March 11, 2026
HomeసినిమాShruti Haasan: '#Nani30'లో శృతి హాసన్

Shruti Haasan: ‘#Nani30’లో శృతి హాసన్

నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం షూటింగ్ దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం గోవాలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక. తాజాగా శృతి హాసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ యేడాది ఆరంభంలో బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డితో అలరించిన శ్రుతి హాసన్ గోవాలో షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కొంత మంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular