Monday, January 20, 2025
Homeసినిమా'సలార్'లో శ్రుతి హాసన్ కనిపించిందంతే!

‘సలార్’లో శ్రుతి హాసన్ కనిపించిందంతే!

శృతిహాసన్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. హిందీలోనూ గుర్తింపు ఉంది. ఈ మధ్య కాలంలో శ్రుతిహాసన్ పోషించిన పాత్రలను చూస్తే అంతగా ప్రాధాన్యత లేకపోవడం కనిపిస్తుంది. ‘హాయ్ నాన్న’ సినిమాలోను ఓ పాటలో మెరిసింది. ప్రభాస్ తో చేసిన ‘సలార్’ తో ఆమె కెరియర్ గ్రాఫ్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఆ సినిమాలో ఆమె పాత్రకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుందని భావించారు. ఆ ఆలోచనతో సినిమాకి వెళ్లినవారికి, ఆమె పాత్ర వైపు నుంచి అసంతృప్తినే మిగిలింది.

‘సలార్’ లో ఆమె ‘ఆద్య’ పాత్రలో నటించింది. విదేశాల నుంచి వచ్చిన ఆమె ఇంగ్లిష్ లో మాట్లాడుతూ కొంతసేపు నానా హడావిడి చేసింది. పోను పోను ఆమె పాత్ర మరింత బలపడుతుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆమె పాత్ర బలహీనపడుతూ వెళుతుంది. ప్రభాస్ తో ఆమె కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. కానీ ప్రభాస్ తో ఒక హీరోయిన్ గా ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. హీరో ఆమెను అసలు పట్టించుకున్నట్టుగానే కనిపించడు.

ఇక ఇంటర్వెల్ తరువాతనైనా ఆమె ఊహించుకున్నట్టుగా ఒక డ్యూయెట్ అయినా పడకపోతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. సెకండాఫ్ లో ఆమె అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది అంతే. అది కూడా హీరో ఫ్లాష్ బ్యాక్ వింటూ. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అనే విషయాన్ని దర్శకుడు మనకి మధ్య మధ్యలో గుర్తు చేయడానికి ఆమెను చూపించవలసి వచ్చింది. ఇలా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో శ్రుతి హాసన్ కనిపించడం ఆమె అభిమానులకు నిరాశను కలిగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్