Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య సరసన శ్రుతీ హాసన్

బాలయ్య సరసన శ్రుతీ హాసన్

Shruti Haasan To Pair Up With Balayya In Malineni Gopichand Movie :

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ అప్ డేట్ ఇచ్చారు. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.

దర్శకుడు గోపీచంద్ మలినేనితో కధానాయిక శ్రుతీ హాసన్ కి ఇది మూడో సినిమా కాగా.. నందమూరి బాలకృష్ణతో శ్రుతీ హాసన్ మొదటి సారిగా కలసి నటించబోతున్నారు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Must Read : గోపీచంద్ కి ‘శృతి’ సెంటిమెంట్!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్