రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలని, సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనిపై ప్రతి ఆరు నెలలకోసారి నివేదికలు పంపాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
ప్రయివేటు సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75శాతం నిబంధన అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికోసమే పరిశ్రమలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నామని… భూములు, ఇతర వనరులు సమకూరుస్తున్నామని చెప్పారు. ఒక పరిశ్రమ సమర్థవంతంగా నడవాలంటే ఆప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరమని, స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇది చేస్తున్నామని చెప్పారు.
ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ప్రతిపాదనలు:
1.
వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె మండలం అశోక్ నగర్, మరియు బక్కన్నవారి పల్లె వద్ద 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు.
ప్రాజెక్టు పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్.
డిసెంబర్ 2024లో పనులు ప్రారంభానికి చర్యలు
3314.93 మిలియన్ యూనిట్లు కరెంటు ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం.
దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు
ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం.
2.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు.
225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి
రూ.2450 కోట్ల పెట్టుబడి.
అక్టోబరు 2023లో పనులు ప్రారంభం.
చివరి దశ 2025 అక్టోబరు నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం.
375 మందికి ఉద్యోగావకాశాలు.
నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల మరియు వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రాజెక్టులు.
3.
విశాఖ జిల్లా అన్నవరంలో
మే ఫెయిర్ హెటళ్లు మరియు రిసార్టులు
రూ.525 కోట్ల పెట్టుబడి.
దాదాపు 750 మందికి ప్రత్యక్షంగా, వేయిమందికి పరోక్షంగా ఉద్యోగాలు.
నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి.
ప్రాజెక్టులో భాగంగా కన్వెన్షన్ సెంటర్, 250 హోటల్ గదులు.
మినీ గోల్ఫ్ కోర్టు తదితర సదుపాయాలు
షాపింగ్ మాల్ సహా విల్లాలు.
4.
తిరుపతి పేరూరు వద్ద రూ. 218 కోట్లతో హయత్ ఇంటర్‌నేషనల్ హోటల్.
260 మందికి ప్రత్యక్షంగా, 1296 మందికి పరోక్షంగా ఉద్యోగాలు.
మూడున్నర సంవత్సరాల్లో పూర్తికానున్న ప్రాజెక్టు.
5.
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
రూ. 1200 కోట్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 1800 మందికి ఉద్యోగావకాశాలు.
6.
తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్ పుడ్ మరియు బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ.
రూ.400 కోట్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు
కాఫీని సాగుచేస్తున్న 2500 మందికి కూడా లబ్ధి.
ఏడాదికి 16వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
7.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్ ఆగ్రో రిసోర్స్ లిమిటెడ్ కంపెనీతో ఎడిబుల్ ఆయిల్ తయారీ ఫ్యాక్టరీ. రూ.230 కోట్ల పెట్టుబడి.
రోజుకు 1400 టన్నులు ఉత్పత్తి.
ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు.
2500 మంది రైతులకూ ఉపయోగం.
8.
తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ.
ఏడాదికి 40వేల టన్నుల తయారీ లక్ష్యం.
రూ.168 కోట్ల పెట్టుబడి.
250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు.
3వేల మంది రైతులకు ప్రయోజనం.