Sunday, February 23, 2025
Homeసినిమా‘నరుడి బ్రతుకు నటన' అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

‘నరుడి బ్రతుకు నటన’ అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో ఈరోజు పునః ప్రారంభమైంది. సిద్దుపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.

కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు యువ దర్శకుడు విమల్ కృష్ణ. ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ఇంతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని, పిఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్