Friday, March 13, 2026
Homeసినిమాసిద్ధు సినిమాకు త్రివిక్రమ్ క్లాప్

సిద్ధు సినిమాకు త్రివిక్రమ్ క్లాప్

వరుస సినిమాలతో పాటు  వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న కొత్త మూవీ (ప్రొడక్షన్ నంబర్ 9) ఈ రోజు సంస్థ కార్యాలయంలో ఉదయం 9.09 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దేవతామూర్తుల ముందు క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్టు ను చిత్ర దర్శకుడికి అందించారు.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్. ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతరపాత్రల్లో నటీ నటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular