Sunday, January 19, 2025
Homeసినిమా ఏపీ సీఎంకు సిరివెన్నెల కుటుంబం ధన్యవాదాలు

 ఏపీ సీఎంకు సిరివెన్నెల కుటుంబం ధన్యవాదాలు

Sirivennela family thanked AP CM :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబం ధన్యవాదాలు తెలియజేసింది. విషయం తెలిసిన వెంటనే ఏపీ సిఎం స్పందించిన తీరుకు కృతజ్ఞతలు ప్రకటిస్తూ కుటుంబ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు

“ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. ది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌ|| ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రి గారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలియజేశారు.

శ్రీ సిరివెన్నెల 30/11/2021 సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
ధన్యవాదాలు సార్..
– సాయి యోగేశ్వర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు” అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : సిరివెన్నెల లేని గేయసీమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్