Saturday, November 23, 2024
HomeTrending Newsతెలుగు సినిమా సిరి'వెన్నెల' అస్తమయం

తెలుగు సినిమా సిరి’వెన్నెల’ అస్తమయం

Sirivennela Is No More :

సుప్రసిద్ధ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న అయన ఈనెల 24న హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల క్రితం అయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ నిన్నటి నుంచి మళ్ళీ తిరగబెట్టింది. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన్ను బతికించలేకపోయారు.

సీతారామ శాస్త్రి ఈ సాయంత్రం 4.07 గంటలకు మరణించినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించారు. లాంగ్ క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారని, ఐసీయూ లో చేర్చి అయన ఊపిరితిత్తులను మెరుగు పరిచేందుకు ఎక్మో సాయంతో కృషి చేశామని, కిమ్స్ ఆస్పత్రి తరఫున అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు ఓ ప్రకటనలో తెలియజేశారు.

సీతారామ శాస్త్రి 1950 మే 20న డా. సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించారు. అయన వయస్సు 66 సంవత్సరాలు. 2019లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇప్పటివరకు అయన దాదాపు 3 వేల పాటలు రచించారు. 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్