Monday, February 24, 2025
HomeTrending Newsవైసీపీ ఆరోపణలపై సిట్ విచారించాలి: లావు డిమాండ్

వైసీపీ ఆరోపణలపై సిట్ విచారించాలి: లావు డిమాండ్

పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను అంటగడుతున్నారని… కులం పేరుతో, వర్గం పేరుతో విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీకి సానుకూల బూత్ లలో తక్కువ మంది పోలీసులని పెట్టి వైసీపీ సానుకూల బుత్ లలో ఎక్కువమంది పోలీసులను పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ వారు చేస్తున్న దుష్ప్రచారంపై సిట్ నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

అధికారులను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందామని వైసీపీ, వైసీపీ బ్లూ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై కూడా విచారించాలని కోరారు. మా కాల్ డేటా, వారి కాల్ డేటాను బయటకు తీసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారంపై ఈసీ, సిట్ ఛీప్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్