Monday, February 24, 2025
Homeసినిమాఆగస్టు 5న 'సీతా రామం' విడుదల

ఆగస్టు 5న ‘సీతా రామం’ విడుదల

for August: వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం‘.  హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో….. రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ‘సీతా రామం’  ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ ‘ఓ సీతా- హే రామా’ పాటకు మంచి ఆదరణ లభించింది. సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్బమ్ మరిన్ని అంచనాలు పెంచింది.

Also Read : ‘ఓ.. సీతా.. వదలనిక తోడౌతా’ సీతా రామం మెలోడీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్