Monday, March 9, 2026
Homeసినిమా‘భీమ్లా నాయక్’ గా దిగిన పవర్ స్టార్

‘భీమ్లా నాయక్’ గా దిగిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా కాంబినేషన్ లో మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీకి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమాని ప్రకటించారు. షూటింగ్ స్టార్ట్ చేశారు కానీ.. ఇన్ని రోజులు పవన్ పాత్ర గురించి రివీల్ చేయలేదు. అయితే.. ఈ రోజు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా కనిపిస్తారని తెలియచేస్తూ.. పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

పవన్ కళ్యాణ్ పోలీస్ గా కనిపిస్తే.. రానా సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. వీరిద్దరి మధ్య ఉండే ఇగో సమస్యే సినిమా కథకి మూలం. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ రోజు మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular