Sunday, September 8, 2024
HomeTrending Newsవిజయ గర్జన సభకు స్థలాల పరిశీలన

విజయ గర్జన సభకు స్థలాల పరిశీలన

Site Inspection In Warangal For Trs Vijaya Garjana Sabha :

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసకున్న సందర్భంగా వరంగల్ నగరంలో ఈ నెల 15వ తేదీన విజయ గర్జన సభ పెట్టాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. 10లక్షల మందితో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఇందులో భాగంగా వరంగల్ న‌గ‌ర సమీపంలోని శివారు ప్రాంతాలు మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ల వద్ద ఖాళీ స్థ‌లాల‌ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఇతర స్థానిక నేతలు కలిసి నేడు పరిశీలించారు.

విజయ గర్జన సభకు భారీ ఎత్తున జనాలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా అన్ని హంగులతో, వసతులతో సభ నిర్వహించేందుకు అనువైన‌ స్థలాలను ప‌రిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ముఖ్య‌మంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదించనున్నారు.

Must Read :గంజాయిపై ఉక్కుపాదం మోపాలి – కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్