Sunday, January 19, 2025
Homeసినిమా‘మహావీరుడు’ సెకండ్ సింగిల్ ‘బంగారుపేటలోన’

‘మహావీరుడు’ సెకండ్ సింగిల్ ‘బంగారుపేటలోన’

శివకార్తికేయన్ , మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. శాంతి టాకీస్‌ పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ రెండవ సింగిల్ ‘బంగారుపేటలోన’ విడుదల చేసారు.

బంగారుపేటలోన పాట బ్యూటీఫుల్ కంపోజిషన్ తో ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది. భరత్ ఈ పాటకు హై బీట్‌ లను అందించి అదితి శంకర్‌ తో కలిసి ఎనర్జిటిక్ గా ఆలపించాడు. ఈ పాట వెంటనే ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రోగ్రామింగ్ చాలా బాగుంది.

ఈ పాటలో శివకార్తికేయన్ ,అదితి బ్యూటిఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రెహమాన్ రాసిన చక్కని సాహిత్యం మరో పెద్ద హైలైట్.ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌ గా, విధు అయ్యన్న కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత వంటి ప్రముఖ తారాగణం వుంది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్