Sunday, January 19, 2025
Homeసినిమాచ‌ర‌ణ్, శంక‌ర్ మూవీలో మరో గెస్ట్ ఆర్టిస్ట్

చ‌ర‌ణ్, శంక‌ర్ మూవీలో మరో గెస్ట్ ఆర్టిస్ట్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తుంది. శంక‌ర్ తెలుగులో చేస్తున్న ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో మ‌హేష్ బాబు స్పైడ‌ర్ మూవీలో విల‌న్ గా న‌టించిన ఎస్.జె. సూర్య ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని తెలిసింది. ఇందులో ముఖ్యమంత్రి కొడుకు పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని.. సినిమాను మ‌లుపు తిప్పే క్యారెక్ట‌ర్ అని స‌మాచారం. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో  ఈ మూవీని రూపొంద‌స్తున్నారు.

ఇందులో చ‌ర‌ణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. అలాగే శ్రీకాంత్, సునీల్, అంజ‌లి పాత్ర‌లు కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయ‌ని తెలిసింది. ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు చ‌ర‌ణ్. దీంతో ఈ మూవీ పై నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి.. చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌లిసి ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్