Sunday, January 19, 2025
Homeసినిమాసెప్టెంబర్ 28న ‘స్కంద’ విడుదల

సెప్టెంబర్ 28న ‘స్కంద’ విడుదల

రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్నయాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’- ది ఎటాకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.  ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ విడుదల చేశారు.  రామ్, శ్రీలీల అందమైన చిరునవ్వులు చిందిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా,  శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక క్రేజ్‌ మరింత పెరిగింది. స్కంద రామ్ కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కూడా రికార్డ్ సృష్టించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్