Tuesday, March 10, 2026
Homeసినిమారష్మిక చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ మూవీ సాంగ్ విడుదల

రష్మిక చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ మూవీ సాంగ్ విడుదల

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని జూలై 21న రిలీజ్ చేయబోతోన్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్లు రిలీజ్ చేశారు. యూ ఆర్ మై డీపీ అంటూ సాగే ఈ పాటను రష్మిక మందాన్న రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సురేష్ గంగుల రాసిన ఈ పాట, భీమ్స్ ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. సాయి మాధవ్, స్వాతి రెడ్డిలు ఆలపించిన ఈ పాట అందరినీ అలరించేలా ఉంది. ఇక ఈ పాటలో సంజయ్ రావు స్టైలింగ్, ఆయన వేసిన స్టెప్పులు, ప్రణవి మానుకొండ లుక్స్ బాగున్నాయి. చూస్తుంటే.. ఈ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో ఖచ్చితంగా ట్రెండ్ అయ్యేట్టుగా ఉంది. ఈ మూవీలో ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular