Sunday, January 19, 2025
Homeసినిమా‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ టీమ్ ప్రయత్నం ఫలించేనా..?

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ టీమ్ ప్రయత్నం ఫలించేనా..?

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు హ్యూమరస్ గా ఉండటం, మ్యారేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ కొత్త పాయింట్ ను చూపెట్టడం ఆసక్తిని కలిగించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సకుటుంబంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని టీమ్ నమ్మకంతో ఉన్నారు. సినిమాతో ఖచ్చితంగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తామని టీమ్ మూవీ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ నెల 29 డేట్ ను లాక్ చేసుకోమని వారు ప్రేక్షకుల్ని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్