Wednesday, March 18, 2026
Homeసినిమా‘రాధే శ్యామ్’ నుంచి సోచ్ లియా సాంగ్

‘రాధే శ్యామ్’ నుంచి సోచ్ లియా సాంగ్

Prabhas-Puja Hegde Mesmerizing:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులు ఆతృత‌గా వేచి చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సోచ్ లియా సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది.

ఆషికి 2, కబీర్ సింగ్ సినిమాకు మ్యాజిక్ చేసిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్‌లో ఈ పాట వచ్చింది. ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. మొన్న విడుదలైన ఆషికి ఆ గయీ ఎలా అయితే ఇన్ స్టంట్ హిట్ అయిందో ఇప్పుడు ఈ పాట కూడా అలాగే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

Also Read : ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular