Saturday, January 18, 2025
Homeసినిమావైజాగ్ లో.. 'ఏజెంట్' వార్

వైజాగ్ లో.. ‘ఏజెంట్’ వార్

Agent in Beach City: యూత్ కింగ్ అక్కినేని అఖిల్, స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో ఏజెంట్ అనే భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ అగ్ర‌హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజా షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. అఖిల్ వైజాగ్ చేరుకోవ‌డంతో అక్కినేని అభిమానులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగ‌తం ప‌లికారు. ఈ షెడ్యూల్ లో అఖిల్, మ‌రి కొంత మంది ఫైట‌ర్స్ పై భారీ యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇటీవ‌ల అఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. చాలా స్టైలీష్ గా.. మాస్ గా ఉన్న ఆ పోస్ట‌ర్ సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌చ్చు. ఈ భారీ ఏజెంట్ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : అఖిల్ కు బర్త్ డే పోస్టర్ గిఫ్ట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్