No Meters: వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించడం ద్వారా 30శాతం విద్యుత్ ఎలా ఆదా అయ్యిందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్ళలో రైతులకు లక్షా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని లెక్కలు చెప్పాలని కోరారు. ఈ ప్రభుత్వ విధానాలతో రెండున్నరేళ్ళలో 2,119మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సోమిరెడ్డి వెల్లడించారు. కానీ ప్రభుత్వం మూదేల్లల్లో 718 మందిని మాత్రమే గుర్తించిందని చెప్పారు. కౌలు రైతుల ఆత్మ హత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, రైతుల ఆత్మా హత్యల్లో మూడో స్థానంలో ఉన్నామని వివరించారు. రైతాంగ స్థితి గతులపై మానవ హక్కుల స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదికపై ఎం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంలో ప్రతిగింజా కొన్నామని, వారంరోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని, కానీ ఈ ప్రభుత్వం నెలరోజులైనా రైతులకు చెల్లించడం లేదని ఆరోపించారు. 75కిలోల బస్తాలో తరుగుకోసం అదనంగా 15కిలోలు ఇవ్వాల్సి వస్తోందని, అదే దళారీలకు అమ్ముకుంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర కంటే 500 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందని సోమిరెడ్డి అన్నారు. పెట్టుబడి సాయం, ధాన్యం తరుగు, దళారీలకు అమ్ముకోవడం ద్వారా ఈ మూడేళ్ళలో వరి పండించే రైతులు దాదాపు 40 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి అదనపు అప్పుల కోసం మీటర్లకు మోటార్లు పెడుతున్నారని, రైతుల మెడకు ఉరితాళ్ళు వేసే ఈ ప్రతిపాదనను విరమించుకోక పొతే తాము రైతుల పక్షాన ఉద్యమానికి సిద్ధమని సోమి రెడ్డి హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఒవైపున డొమెస్టిక్ పవర్ ఛార్జీలు పెంచుతున్నారని, మరోవైపు మీటర్లు పెడుతున్నారని ఈ లాజిక్ ఏమిటో అర్ధం కావడం లేదని సోమిరెడ్డి అన్నారు.