Friday, November 22, 2024
HomeTrending Newsమీరూ కాస్త తగ్గించండి: సోము

మీరూ కాస్త తగ్గించండి: సోము

పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  సూచించారు.

“కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద తగ్గించిన 5, 10 రూపాయలకు కు అదనంగా అస్సాం, త్రిపుర, గోవా, మణిపూర్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోలు ,డీజిల్ రెండింటిపైన 7రూపాయలు వ్యాట్ ను తగ్గించాయి. అంటే పెట్రోలు 12, డీజిల్ 17 రూపాయల మేర తగ్గింది. @ysjagan గారి ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించి ఈ దీపావళి నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అధిక ధరల నుండి ఉపశమనం కలిగించాలి” అని ట్వీట్ చేశారు.

దేశ ప్రజలకు దీపావళి కానుకగా పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం బాటలోనే బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అస్సాం, త్రిపుర, గోవా, మణిపూర్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై ఏడు రూపాయలు వ్యాట్ తగ్గించాయి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 12 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత విజయవాడలో పెట్రోలు ధర 116 నుంచి 110; డీజిల్ రేటు 106 నుంచి96 రూపాయలకు తగ్గింది. దీనికి అదనంగా రాష్ట్రం ప్రభుత్వం కూడా వ్యాట్ ను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్