Sunday, November 24, 2024
HomeTrending Newsతాబేదార్లుగా ఉన్నారు: సోము ఫైర్

తాబేదార్లుగా ఉన్నారు: సోము ఫైర్

చీఫ్ సెక్రెటరీ, డిజిపి స్వతంత్రంగా వ్యవహరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. యంత్రాంగం సక్రమంగా పని చేయాలని అప్పుడే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా అందుతాయని  అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఉద్యోగుల వ్యవస్థ ఉందని, అధికారంలో ఉన్న పార్టీల ఇష్టానుసారం వ్యవస్థ నడిచేటప్పుడు ఈ యంత్రాంగం దేనికని ప్రశ్నింకాహారు. దీనికంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడం మంచిదని వ్యంగ్యంగా అన్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను అలాగే తెచ్చిందన్నారు. తిరుపతిలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు,

ప్రభుత్వం, యంత్రాంగం ఏదైనా ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుందని, కానీ వైఎస్సార్సీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే అధికారులు స్పందించాల్సి ఉంటుందన్నారు. చిత్తూరులో రైతు ఆత్మ హత్య, కావలిలో ఎమ్మెల్యే అనుచరుల వేధింపులకు తట్టుకోలేక మరో రైతు ఆత్మ హత్య చేసుకున్నారని చెప్పారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సక్రమంగా పనిచేయాలని, కానీ రాష్ట్రంలో ఈ రెండు వ్యవస్థలూ ప్రభుత్వానికి తొత్తులుగా, తాబేదార్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం పూర్తిగా స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తోందని సోము విమర్శించారు.  ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై,  అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50, రాష్ట్రంలో 5వేల బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Also Read రెండు పార్టీలూ కవల పిల్లలు: సోము 

RELATED ARTICLES

Most Popular

న్యూస్