Friday, February 28, 2025
HomeTrending NewsBJP-AP: అప్పుడేం చేశారు?: బాబుకు సోము ప్రశ్న

BJP-AP: అప్పుడేం చేశారు?: బాబుకు సోము ప్రశ్న

సిఎం జగన్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గతంలో బాబు సిఎం గా ఉండగా జగన్ పాదయాత్ర చేస్తే రాష్ట్రమంతా ఎలాంటి ఇబ్బందీ కలగనీయకుండా తిప్పారని,  అప్పుడు జగన్ ఏం చేసినా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కేంద్రాన్ని అడగడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. తిరుపతిలో అమిత్ షా వాహనంపై దాడి చేస్తే బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్రంలో చక్రం తిప్పానని, ప్రధానులను నియమించానని చెప్పుకున్న చంద్రబాబుకు విశాఖ రైల్వే జోన్ సాధించడం చేతకాలేదా అని ప్రశ్నించారు. ఒంగోలులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనతరం సోము మీడియాతో మాట్లాడారు.

గతంలో ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు హోదా డిమాండ్ చేస్తున్నారన్నారు. నోటాతో పోటీ పడే పార్టీ బిజెపి అని గతంలో ఎద్దేవా చేసిన ఆయన ఇప్పుడు తమతో ఎలా పొత్తు పెట్టుకుంటారని నిలదీశారు.

శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఇది తెలిసి కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని అడగడంలో అర్ధం లేదన్నారు. గతంలో సిబిఐని రాష్ట్రంలో ప్రవేశించకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పని చేయకుండా అడ్డుకున్న బాబుకు ఇప్పుడు కేంద్రం గుర్తొచ్చిందా అని వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు. బాబుకు దమ్ముంటే అన్ని అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.  పొత్తుల అంశంపై నిర్ణయించడానికి తమది గల్లీ పార్టీ కాదని ఢిల్లీ పార్టీ అని స్పష్టంచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్