Monday, February 24, 2025
HomeTrending Newsబాబు అవకాశవాది : సోము

బాబు అవకాశవాది : సోము

Babu is optimistic: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, ఎవరినైనా, ఏ సమయంలోనైనా వాడుకొని తర్వాత వదిలేస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నాటి మామ ఎన్టీఆర్ నుంచీ మొన్నటి బిజేపీ వరకూ అదే వరస అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీకి శత్రు గండం తొలగిపోవాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మహా మృత్యుంజయ జపం నిర్వహించారు, సోము ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం పొత్తుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోము స్పందించారు. జనసేన తమతో పొత్తులో ఉందని సోము అన్నారు.

ఏ సందర్భంలో ఎవరితోనైనా లవ్ లో ఉండగల సమర్ధత బాబుకుందని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలతోనూ చక్రాలు తిప్పుతారని ఆ తర్వాత వదిలేస్తారని విమర్శించారు.  1989లోనే చంద్రబాబు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీతో పొట్టు కుదుర్చుకొని కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్